దేశంలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా కేసులు : మళ్లీ లాక్డౌన్ తప్పదా?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:06 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా, గత సంవత్సరం నవంబరు తర్వాత, యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య తొలిసారిగా భారీగా పెరగడంతో పాటు, 17 రోజుల తర్వాత మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది. 
 
గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా, 4,421 కేసులు వచ్చాయి. నవంబరు నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి.
 
ఆపై తిరిగి నిన్న ఆ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది. 
 
ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి.
 
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 
 
కొత్త కేసుల్లో న్యూ స్ట్రెయిన్ అధికంగా కనిపిస్తుండటంతో, దాని వ్యాప్తి గొలుసును విడగొట్టేందుకు వైద్యాధికారులు, స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

Manjula: అగధ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

తర్వాతి కథనం
Show comments