Corona: 9 లక్షలకి దిగువకు యాక్టివ్‌ కేసులు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (12:50 IST)
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటం ఊరటనిస్తోంది. పలు రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలతో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య లక్షకు దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 62వేల మంది వైరస్‌ బారినపడగా.. లక్షకు పైనే కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పించింది.
 
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 19,30,987 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 62,224 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.96కోట్లకు చేరింది. వరుసగా తొమ్మిదో రోజు పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువనే ఉంది.
 
ఇదే సమయంలో 1,07,638 మంది వైరస్‌ నుంచి కోలుకున్నాయి. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2.83కోట్లుగా ఉంది. రికవరీ రేటు 95.80శాతానికి పెరిగింది.
 
కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 9లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,65,432 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 2.92శాతంగా ఉంది.
 
ఇక మరణాల సంఖ్య కూడా 3 వేలకు దిగువనే ఉంటడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 2542 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,79,573 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది.
 
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 28లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో మొత్తం వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 26కోట్లు దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajjamoulii: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments