వైరస్ మళ్లీ తిరిగొచ్చింది, ఊపిరి బిగబట్టిన చైనా

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (19:35 IST)
పుట్టించిన భూతమే చంపడానికి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసి వచ్చింది చైనాకు. కరోనా వైరస్‌కు సృష్టికర్తలు తాము కాదని చైనా ఎంత వాదిస్తున్న ఇప్పటివరకు ఉన్న ఆధారాలతో చైనా దేశమే కారణమని స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశం డెల్టా వేరియెంట్‌తో వణికిపోతోంది. 
 
రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో భయాందోళనకు గురి అవుతోంది చైనా. 20కి పైగా నగరాలలో డెల్టా వేరియంట్ కేసుల ప్రభావం కనిపిస్తోంది. పదికి పైగా పేరియంట్లలో ప్రావెన్సీ ప్రభావం కనబడుతోంది. ఏం చేయాలో చైనా దేశానికి పాలుపోవడం లేదు. వైరస్ వ్యాప్తిని నిరోధించడం అంత ఆషామాషీ విషయం కాదు. ఆంక్షలు విధించడం తప్ప వేరే గత్యంతరం లేదు. చైనా ఇప్పుడు అదే పని చేస్తోందట.
 
రష్యా నుంచి వచ్చిన విమానాన్ని శుభ్రం చేసిన తొమ్మిది మంది విమానాశ్రయ సిబ్బందికి డెల్టా వేరియంట్ సోకిందట. అయితే అది రష్యా నుంచి వచ్చిందా లేకుంటే చైనా వాళ్ల వల్ల సోకిందా అన్నది ఇప్పటికీ తేలలేదు.
 
బీజింగ్‌లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసిందట. ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో గత్యంతరం లేక చివరకు కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. వూహాన్ ప్రాంతం మొత్తం లాక్‌డౌన్‌లో ఉందట. 
 
లక్షలాది మంది చైనా దేశస్తులు ఇంటికే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో నగరంలోకి ఎవరినీ అనుమతించడం లేదట. ముఖ్యంగా టూరిస్టులను అస్సలు అనుమతించడం లేదట. వూహాన్ వాసులు భయంతో వణికిపోతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

తర్వాతి కథనం
Show comments