3 వేల కరోనా కేసులకే 2 కోట్ల మందిని లాక్ డౌన్ చేసిన చైనా: భారత్‌లో 2503 కొత్త కేసులు సంగతేంటి?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (11:14 IST)
చైనా అతిగా స్పందిస్తోందా? లేదంటే గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తపడుతోందా? రోజుకి 3 వేల కేసులు నమోదవుతూ వుండటంతో ఏకంగా 2 కోట్ల మందికి లాక్ డౌన్ విధించి ఇంట్లో నుంచి బయటకు రానివ్వడంలేదు. ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో సహా చాలా దేశాలు కోవిడ్-19 కేసుల తగ్గుదల కనిపించడంతో సాధారణ జీవితానికి తలుపులు తెరిచాయి.

 
చైనా రెండేళ్లుగా కరోనా వైరస్ వ్యాప్తిని చూస్తోంది. ఆదివారం నాడు ఆ దేశంలో ఒకే రోజులో 3,100 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది రెండేళ్లలో అత్యధికం. ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల పెరుగుదల చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం చైనాలోని వివిధ ప్రాంతాలలో మిలియన్ల మందిని లాక్‌డౌన్‌లో పెట్టేసింది.

 
మన దేశంలో 2,503 కొత్త కేసులు, లాక్‌డౌన్ వుందా?
ఇక మన దేశం విషయానికి వస్తే గత 24 గంటల్లో 2,503 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 మే నుండి చూస్తే ఇది అత్యల్పమైన సంఖ్య. యాక్టివ్ కేసులు 36,168కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 
తాజా కేసులతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,29,93,494కి పెరిగింది.

 
27 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,15,877కి చేరుకుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు తాజా డేటాను వెల్లడించింది. మరి చైనా 3 వేల కేసులకే 2 కోట్ల మందికి లాక్ డౌన్ విధిస్తే మన దేశంలో ఎన్ని కోట్లమందికి విధించాలో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments