Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-03-2022 నుంచి 19-03-2022 వరకు మీ వార రాశిఫలాలు

Advertiesment
13-03-2022 నుంచి 19-03-2022 వరకు మీ వార రాశిఫలాలు
, శనివారం, 12 మార్చి 2022 (22:08 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఈ వారం అనుకూలదాయకం. మాట నిలబెట్టుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. కార్మికులకు ఆశాజనకం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అవివాహితులకు శుభయోగం. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. తొందరపడి హామీలివ్వవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు 
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. విమర్శలు పట్టుదలను పెంచుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. మీపై శకునాల ప్రభావం అధికం. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. తల పెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రియతములతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు కష్టకాలం. అకౌంట్స్ రంగాల ఒత్తిడి అధికం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
వ్యవహారాలలో తలమునకలవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. యత్నాలు విరమించుకోవద్దు. గురు, శుక్రవారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సాయం ఆశించి భంగపడతారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం, గృహమరమ్మతులు చేపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు ఆకస్మిక స్థానచలనం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
గ్రహాల అనుకూలత ఉంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వేడుకను ఆర్బాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శనివారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతి. పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. దూరాన ఉన్న ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. మానసికంగా కుదుటపడతారు. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆది, బుధవారాల్లో అప్రమత్తంగా వ్యవహరింంచాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు తప్పకపోవచ్చు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థాల్లో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త గుట్టుగా వ్యవహరించండి. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. అయిన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
అనుకూల ఫలితాలున్నాయి. మీ కష్టం వృధా కాదు. లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుత్వాలు విస్తరిస్తాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గురు, శుక్రవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. సన్నిహితుల సలహా పాటించండి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధి పథకాలు చేపడతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు పనులు లభిస్తాయి. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం, విలాసాలకు వ్యయం చేస్తారు. గృహమార్పు సత్పలితాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ద వహించండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
మీ ఓర్పునకు పరీక్షా సమయం. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. ఆది, సోమవారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుకు అనుగుణంగా మార్పులు చేపడతారు. సంతానం కదలికల పై దృష్టి సారించండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఆకస్మిక స్థానచలనం. రిటైర్డు ఉద్యోగస్తులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. మీ ఆలోచనలను కొంతమంది నీరుగారుస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు. గుట్టుగా వ్యవహరించండి. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఇంటి విషయాలు పట్టించుకోండి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. అవివాహితులకు శుభయోగం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-03-2022 శనివారం రాశిఫలాలు - శ్రీరామును పూజించిన శుభం