Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్‌లో కరోనా వైరస్ లక్షణాలు ... నిజమా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (15:36 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి మాత్రం ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇపుడు కొత్తగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్‌లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని చైనా అధికారిణి ఒకరు కనుగొన్నారు. ఈ చికెన్ బ్రెజిల్ నుంచి చైనాలోకి దిగుమతి అయింది. అంతేకాకుండా, ఈ వారం ఈక్వెడార్ నుంచి వచ్చిన ఎండ్రకాయలు, చేపలకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. జూన్‌ నెలలో బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాల నుంచి మాంసం దిగుమతులను చైనా నిలిపివేసింది. 
 
ఇటీవల బ్రెజిల్ నుంచి చైనాకు దిగుమతి అయిన కోడిమాంసాన్ని స్కెంజెన్ యొక్క స్థానిక వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) సాధారణ పరిశోధనల నమూనాలను సేకరించి పరీక్షలు జరుపగా కరోనా పాజిటివ్‌గా నివేదికలు వచ్చాయి. బ్రెజిల్ నుంచి చికెన్‌తో రవాణా చేసిన ఇతర ఆహార ఉత్పత్తుల నమూనాలు ప్రతికూలంగా వచ్చాయని అధికారులు గురువారం తెలిపారు. ప్రస్తుతం, బ్రెజిల్ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
 
దీంతో స్కెంజెన్ సీడీసీ ఇతర దేశాల నుంచి ఆహార ఉత్పత్తులను తినడంలో జాగ్రత్త వహించాలని చైనా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. చైనా రాజధాని బీజింగ్‌లోని షిన్ఫాడీ సీఫుడ్ మార్కెట్లో వ్యాప్తి కేసులు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రభుత్వం అన్ని ఆహార ఉత్పత్తుల నమూనాలను సేకరించి కరోనా వైరస్ ఉన్నదీ లేనిదీ కనుగొనేందుకు సిద్ధమయ్యారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments