కోవిడ్ వైరస్ నుంచి కోలుకుంది.. కానీ శరీరమంతా చీముతో నిండిపోయింది..!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (16:25 IST)
కరోనా నుంచి దూరంగా వుండటం మేలు. లేదంటే కరోనా సోకిన తర్వాత ఏర్పడే లేనిపోని ఇబ్బందులతో నానా తంటాలు పడక తప్పదు. తాజాగా అలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది.

కరోనా సోకడంతో చికిత్స పొందిన ఓ మహిళ.. ఆస్పత్రి నుంచి విడుదల అయ్యింది. కానీ ఆ మహిళ శరీరమంతా చీముతో నిండిపోయింది. దీంతో మూడుసార్లు ఆమెకు శస్ర్త చికిత్స నిర్వహించి చీమును తొలగించారు వైద్యులు.

ముంబై ఔరంగాబాద్‌లోని బజాజ్ నగర్‌కు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరింది. కొద్ది రోజుల తర్వాత ఆమె వెన్నునొప్పితో పాటు నడుము నొప్పితో బాధపడుతోంది.
 
దీంతో ఆమె నవంబర్ 28న హెడ్గేవార్ ఆస్పత్రికి వెళ్లింది. ఆ మహిళ కాళ్లు కూడా వాచిపోయాయి. దీంతో బాధితురాలికి వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించగా, మెడ భాగంతో పాటు వెన్ను భాగంలో చీము నిండిపోయినట్లు తేలింది. అంతే కాదు.. చేతులు, పొట్ట భాగంలో కూడా చీము ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.
 
ఆ తర్వాత మూడు పర్యాయాలు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి హాఫ్ లీటర్ చీమును తొలగించారు. అయితే శరీరంలో ఏమైనా కణితిలు పగలడం వల్ల లేదా, ఫ్యాక్చర్ జరిగినా ఇలా చీము ఏర్పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఏడు మాత్రమే నమోదు అయ్యాయి. భారత్‌లో ఇదే తొలి కేసు అని వైద్యులు తెలిపారు. డిసెంబర్ 21న మహిళను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments