Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా.. ఆర్బీఐ చెప్పేదేమిటంటే?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (16:20 IST)
కరోనాతో పాటు ఇతరత్రా వైరస్‌లు కరెన్సీ నోట్ల ద్వారా వ్యాపించే అవకాశం వుందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. గత మార్చి 9వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాసిన లేఖలో.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తించే అవకాశం వుందని తెలిపింది. 
 
కరోనా మాత్రమే కాకుండా బ్యాక్టీరియాలు, వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతాయా అనే అనుమానాన్ని లేవనెత్తింది. ఈ లేఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి పంపింది. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌తో పాటు బ్యాక్టీరియాలు కూడా వ్యాపించే అవకాశం వుందని తెలిపింది. 
 
అందుచేత కరోనాను నియంత్రించేందుకు కరెన్సీ వినియోగాన్ని తగ్గించుకుని డిజిటల్ లావాదేవీలను చేయాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఇంకా ప్రజలు అనవసరంగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసుకోవద్దని.. అనేక ఆన్‌లైన్ వసతుల ద్వారా నగదు లావాదేవీలను జరపాలని ఆర్బీఐ తెలిపినట్లు ఆల్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments