తెలంగాణ, కర్ణాటక హై రిస్క్ రాష్ట్రాలు: ఏపీ సర్కారు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (22:29 IST)
తెలంగాణ, కర్ణాటకను సహా హైరిస్క్ రాష్ట్రాలుగా ఏపీలోని వైకాపా సర్కారు పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, కర్ణాటకల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ, కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఏపీకి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న నేపథ్యంలో హై రిస్క్ ప్రాంతాలుగా మార్పులు చేయడం జరిగిందని జవహర్ రెడ్డి తెలిపారు. ఫలితంగా విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారు ఖచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనన్నారు.

విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలి. విమానాశ్రయాల్లోనే స్వాబ్ టెస్టులు చేసి, 14 రోజుల హోమ్ క్వారంటైన్ వెసులుబాటు కల్పించాలని జవహర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments