Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో 54 కొత్త పాజిటివ్ కేసులు.. ముగ్గురికి కరోనా అంటించిన సిగరెట్

Webdunia
గురువారం, 28 మే 2020 (14:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 54 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,858 శాంపిళ్లను పరీక్షించగా మరో  54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేసమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,841అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 824 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,958 మంది డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో కొవిడ్‌-19తో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది.
 
ఇదిలావుంటే, ఈ కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి రకరకాలుగా విస్తరిస్తోంది. తాజాగా అలాంటి ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కరోనా విస్తరణకు ఒక సిగరెట్ కారణమయింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ జియాగూడలో కరోనా వచ్చిన వారి అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు. 
 
షాద్ నగర్‌కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి సిగరెట్ తాగాడు. ముగ్గురు స్నేహితులు ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకోవడంతో... ముగ్గురికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ముగ్గురినీ క్వారంటైన్ కు తరలించారు. మరోవైపు షాద్ నగర్‌లో ఇప్పటికే కరోనా కేసులు 7కు చేరుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments