Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా వైరస్ రక్కసి ... పారిశ్రామికవేత్త మృతి

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (18:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో కరోనా రోగులతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. 
 
ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు.. గడచిన 24 గంటల్లో 93 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనాతో మరణాలు నమోదవుతుండడంపట్ల ఆందోళన నెలకొంది.
 
ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,296కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 9,597 పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,146 కాగా, ఇంకా 90,425 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 6,676 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 1,61,425 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది.
 
ఇదిలావుండగా, తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ సోకి చనిపోయారు. గత కొన్నిరోజులుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పాలెం శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన గతంలో కడప లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments