Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు.. నలుగురు మృతి

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (18:52 IST)
కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే వుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. తాజాగా ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,80,430కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. 
 
ఇప్పటివరకు కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 7,091 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 3,861 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,69,478 మంది రికవరీ అయ్యారు. కొత్తగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా మృతి చెందారు.
 
కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా కేసులు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజలను స్ట్రెయిన్ వైరస్ కలవర పెడుతోంది. యూకే నుంచి జిల్లాకు వచ్చిన వారి కోసం విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్పత్రిలో 300 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 150 కోవిడ్, మరో 150 బెడ్లను నాన్ కోవిడ్ పేషెంట్లకు కేటాయించారు. 
 
యూకే నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి.. పరిస్థితిని బట్టి వారిని సంబంధిత వార్డుల్లో క్వారంటైన్ చేస్తున్నారు. కాగా, స్ట్రెయిన్ కలకలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అలెర్ట్ చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments