Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో దుమ్మురేపుతున్న కరోనా పాజిటివ్ కేసులు - ఉండవల్లికి పాజిటివ్

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (19:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులుకారు. ప్రతి ఒక్కరిపై దాడి చేస్తోంది. 
 
ఫలితంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు దుమ్మురేపుతున్నాయి. బుధవారం ఏకంగా సుమారుగా 11 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా ప్రకటన మేరకు... బుధవారం కొత్తగా 10,830 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,82,469కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్‌ కేసులున్నాయి. బుధవారం వరకు 2,86,720 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 3,541 మంది మృతి చెందారు. 
 
ఇదిలావుండగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు కరోనా సోకింది. రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహాలను పాటిస్తూ రాజమండ్రిలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments