Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు విరుగుడుగా డూప్లికేట్ కరోనా వైరస్... ఇదెలా సాధ్యమంటే..?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (15:29 IST)
కరోనాకు విరుగుడుగా సరికొత్త డూప్లికేట్ సింథటిక్ కరోనా వైరస్‌ని తయారుచేశారు అమెరికా శాస్త్రవేత్తలు. ఇది నిజమైన కరోనా లాగే ఉంటుంది. కాకపోతే... కాస్త చిన్నగా ఉంటుంది. ఇది నిజమైన కరోనాను మోసం చేసి పెరగకుండా ఆపేస్తుంది. ఇదెలా సాధ్యమంటే..? ఒరిజినల్ కరోనా... మనిషి శరీరంలోకి వెళ్లాక... ఏదో ఒక కణానికి అతుక్కుంటుంది. అలా అతుక్కునేలా కరోనా చుట్టూ జిగురు లాంటి కొవ్వు పదార్థం ఉంటుంది. 
 
అలా అతుక్కున్న కరోనా... తన జన్యు పదార్థాన్ని (RNA) కణంలోకి పంపిస్తుంది. దాంతో... ఆ కణం... వైరస్ వశం అవుతుంది. కణానికి అందే శక్తిని, ఆహారాన్నీ... కరోనా తీసుకుంటుంది. దాంతో వైరస్ తనకు ఇల్లు దొరికినట్లుగా ఫీలవుతుంది. ఇక ఆ కణంలో ఉంటూ... మరిన్ని కరోనా వైరస్‌లను సృష్టిస్తుంది. అలా పుట్టిన కరోనా వైరస్‌లు మరిన్ని కణాలను అతుక్కుంటాయి. ఇలా... కరోనా వైరస్ సంఖ్య పెరుగుతూ పోతుంది.
 
అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ సైంటిస్టులు... డిఫెక్టివ్ ఇంటర్‌ఫియరింగ్ విధానంలో డూప్లికేట్ కరోనాను తయారుచేశారు. ఈ కరోనాను మనిషి శరీరంలోకి పంపుతారు. ఇది బాడీలోకి వెళ్లాక నిజమైన వైరస్ వృద్ధి చెందకుండా చేస్తుంది. దాని పునరుత్పత్తిని ఆపేస్తుంది. 
 
దాంతో... నిజమైన వైరస్... క్రమంగా తగ్గిపోతుంది. ఇక డూప్లికేట్ వైరస్ చాలా చిన్నగా ఉంటుంది. ఒరిజినల్ వైరస్ కంటే 90 శాతం చిన్నగా ఉంటుంది. అందువల్ల ఇది మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందుతుంది. అందువల్ల ఒరిజినల్ వైరస్ ఒక్క రోజులోనే సగానికి తగ్గిపోతుంది. రెండు రోజులకే పూర్తిగా పోతుంది. ఆ తర్వాత డూప్లికేట్ వైరస్ కూడా దానంతట అదే నశిస్తుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments