Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది గొరిల్లాలకు కరోనా.. మరికొన్ని కూడా తగ్గుతున్నాయ్..

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (07:14 IST)
అమెరికాలోని శాన్‌డియాగో నగరంలో ఉన్న సఫారీ పార్కులో గొరిల్లాలకు కరోనా సోకింది. జూలో ఒకే చోట కలిసి ఉంటున్న ఎనిమిది గొరిల్లాలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, మరికొన్ని కూడా దగ్గుతున్నాయని పార్కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లీసా పీటర్సన్‌ చెప్పారు. గొరిల్లాలకు కరోనా సోకడం ఇదే తొలిసారి. వీటికి జూ వర్కర్ నుంచి వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. 
 
కరోనా సోకిన ఆ రెండు గొరిల్లాలూ బాగానే ఉన్నాయని, ఆ రెండింటినీ క్వారంటైన్‌లో ఉంచామని కాలిఫోర్నియా గవర్నర్ తెలిపారు. త్వరలో ఇవి కోలుకుంటాయని భావిస్తున్నామన్నారు. మనుషులతో పోలిస్తే గొరిల్లాల డీఎన్ఏ 98% సరిపోలుతుంది. ఈ జూలోకి సందర్శకులకు ప్రస్తుతం అనుమతించడం లేదు.
 
ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలో డిసెంబరు 6 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో ఈ పార్కు సైతం మూసే ఉంది. సందర్శకుల్ని అనుమతించడం లేదు. జూలో గొరిల్లాలకు దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు ఇటీవల కొవిడ్‌-19 బారినపడ్డారు. ఆ వ్యక్తి నుంచే వాటికి వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments