కరోనా కోరల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టీవీ నటుడు సాక్షిశివ!

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:54 IST)
తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సినీ ప్రపంచాన్ని ఇప్పటికే కరోనా పలకరించింది. బుల్లితెర నటులు కూడా కరోనా కోరలకు చిక్కారు. ప్రస్తుతం టీవీ నటుల వంతు వచ్చింది. టీవీ నటుడు సాక్షిశివకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు.

ఇప్పటికే టీవీ నటులు ప్రభాకర్‌, హరికృష్ణ, నవ్యకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరగడంతో టీవీ నటుల్లో ఆందోళన మొదలైంది.
 
మరోవైపు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలకు సైతం కరోనా సోకింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

గత రెండు రోజుల క్రితం అస్వస్థతతో ఆమె యశోదాలో చేరారు. ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments