Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోటికి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (11:09 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువగా వచ్చాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు... గత 24 గంటల్లో 22,065 మందికి కరోనా నిర్ధారణ అయింది. గత ఐదు నెలల కాలంలో ఒక రోజు నమోదైన అతి తక్కువ కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఈ కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 99,06,165కు చేరింది. ఇక గత 24 గంటల్లో 34,477 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 354 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,43,709కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 94,22,636 మంది కోలుకున్నారు. 3,39,820 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,55,60,655 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,93,665 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 491 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 596 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,69,828 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,499కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,272 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,169 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments