దేశంలో గత 24 గంటల్లో మరో 30254 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో 30,254 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,57,029కు చేరింది.
ఇక గత 24 గంటల్లో 33,136 మంది కోలుకున్నారు. గత 24 గంటల సమయంలో 391 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,43,019కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 93,57,464 మంది కోలుకున్నారు. 3,56,546 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,37,11,833 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం 10,14,434 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 609 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,724కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,68,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,493కి చేరింది.
తెలంగాణలో ప్రస్తుతం 7,630 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,546 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 127, రంగారెడ్డి జిల్లాలో 58 కరోనా కేసులు నమోదయ్యాయి.