విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో యం.సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం కళాపోషకులు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. హీరో సుమన్ ముఖ్య అతిధిగా విచ్చేసి 'కళాపోషకులు' ట్రైలర్ లాంఛ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.సముద్ర, నిర్మాత డి.యస్. రావు ఆత్మీయ అతిధులుగా పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదల కానుంది.
ముఖ్యఅతిథి సుమన్ మాట్లాడుతూ, సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ రామానుజం అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో నా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. వారి అబ్బాయి విశ్వకార్తికేయ హీరోగా నటించిన "కళాపోషకులు" సినిమాలో నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాను. షూటింగ్ బిగినింగ్ నుండి ఈ చిత్రం గురించి అన్ని వివరాలు రామనుజం చెప్పేవాడు. ఆయన కోసమే ఈ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాను. ట్రయిలర్ చాలా బాగుంది. ఓవర్‌గా కాకుండా అందరూ నేచురల్‌గా యాక్ట్ చేశారు. కళ్యాణ్ ఫోటోగ్రఫీ, ఎలెందర్ మ్యూజిక్ సింప్లి సూపర్బ్.
విశ్వకార్తికేయను చిన్నప్పుడు నుండి చూస్తున్నాను. బాల నటుడిగా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు. ఇప్పుడు హీరోగా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ మంచి ఈజ్‌తో చేసాడు. తప్పకుండా ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబడతాడని నాకు నమ్మకం ఉంది. ఇక దర్శకుడు చలపతి పిసిరెడ్డి గారి స్కూల్ నుండి వచ్చాడు కాబట్టి ఈ సినిమాని వండర్‌ఫుల్‌గా తెరకెక్కించాడని భావిస్తున్నాను.
కరోనా పీక్ స్టేజ్‌లో వున్నా కూడా షూటింగ్ చేసిన నిర్మాత సుధాకర్ రెడ్డి గట్స్‌కి హ్యాట్సాప్. ఎంతోమంది నటీనటులకి టెక్నీషియన్స్‌కి సహాయాన్ని అందించారు. ఈ సినిమాకి వర్క్ చేసిన టీమ్ అందరికీ అభినందనలు అన్నారు. ప్రముఖ దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ, ఈ సినిమా చూసాను. చాలా బాగుంది. ఇట్స్ ఎ ఔట్ అండ్ ఎంటర్టైనర్.. మా శిష్యుడు చలపతి చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. సుధాకర్ రెడ్డి ఫస్ట్ సినిమా అయినా మేకింగ్ వైజ్‌గా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కరోనా కష్ట కాలంలో కళ గొప్పదని కళాకారులు చిత్రాన్ని నిర్మించారు. విశ్వకార్తికేయ ఎక్సలెంట్‌గా చేసాడు. ఫ్యూచర్లో గొప్ప స్టార్ అవుతాడు. 18 న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇది నా ఫస్ట్ ఫిల్మ్. చలపతి చాలా బాగా తీశాడు. ఎలెందర్ మ్యూజిక్, రీ-రికార్డింగ్ వండర్‌ఫుల్‌గా చేశాడు.. కళ్యాణ్ సమి విజువల్స్ సూపర్బ్‌గా ఇచ్చారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్18న భారీగా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ... సుమన్ గారి చేతులు మీదుగా ట్రయిలర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించి వర్క్ చేశారు.. చలపతి ఈ సినిమాని చాలా ఫాస్ట్‌గా ఎక్కడ వేస్టేజ్ లేకుండా తెరకెక్కించాడు. ఒక బ్రదర్‌లా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది.
ఇక నిర్మాత సుధాకర్ రెడ్డి కరోన టైంలో కూడా భయపడకుండా పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేశారు. ఆయన గట్స్‌కి నిజంగా హ్యాట్సాప్. కళ్యాణ్ విజువల్స్, ఎలెందర్ మ్యూజిక్ సినిమాకి మేజర్ ఎసెట్‌గా నిలిచాయి. టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. కళాపోషకులు సినిమా ఆడియెన్స్‌ని కడుపుబ్బ నవ్విస్తుందని గ్యారెంటీగా చెప్పగలను.. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.
విశ్వకార్తికేయ, దీప ఉమాపతి జంటగా నటించిన ఈ చిత్రంలో భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్, చిట్టిబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: కళ్యాణ్ సమి, ఎడిటర్: సెల్వ కుమార్, సంగీతం: ఎలేందర్ మహావీర్, పీఆర్ఓ: సాయి సతీష్, నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎం. స్క్రీన్ ప్లే-డైలాగ్స్- డైరెక్షన్: చలపతి పువ్వల.