చిన్నారులను కూడా వదలని కరోనా రక్కసి.. వెయ్యిమందికి..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (10:29 IST)
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చిన్న పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే దిశగా రూపం మార్చుకుంటోంది. ఉత్తరాఖండ్‌లో 10 రోజుల వ్యవధిలో 9 ఏళ్లలోపు వెయ్యి మంది చిన్నారులకు కరోనా సోకినట్లు ఓ సర్వేలో తేలింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా అందింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరారు.
 
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి 15 తేదీల మధ్య 2 వందల 64 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు వెయ్యి 53 మందికి, ఈ నెల ఒకటి నుంచి 14 వరకు వెయ్యి ఆరు వందల 18 మంది చిన్నారులకు వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చిన్నారులపై కొవిడ్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోందని స్పష్టమవుతోంది.
 
మొత్తంగా 21 వేల 8 వందల 57 మంది చిన్నారులకు వైరస్ సోకింది. కేవలం ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చిన్నారుల్లో పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో చిన్నారులకు త్వరగా అందుబాటులోకి వస్తేగాని కట్టడి చేయలేమని…. టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments