Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదా పిండిలో ఎన్ని విషపూరిత రసాయనాలు ఉంటాయో తెలుసా?

తినుబండరాల తయారీలో మైదాపిండిని తప్పకుండా వినియోగిస్తుంటారు. అలాంటి మైదాపిండిలో ఎన్ని రకాల విషపూరిత రసాయన పదార్థాలు ఉన్నయో తెలుసుకుంటే మాత్రం మీరు ఈ జన్మలో మళ్లీ ఆ పిండిజోలికి వెళ్లరు.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (15:41 IST)
తినుబండరాల తయారీలో మైదాపిండిని తప్పకుండా వినియోగిస్తుంటారు. అలాంటి మైదాపిండిలో ఎన్ని రకాల విషపూరిత రసాయన పదార్థాలు ఉన్నయో తెలుసుకుంటే మాత్రం మీరు ఈ జన్మలో మళ్లీ ఆ పిండిజోలికి వెళ్లరు. 
 
అసలు మైదా పిండి తెల్లగా ఎందుకు ఉంటుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోవాల్సిందే. మిల్లులో బాగా పోలిష్ చేసిన గోధుమ పిండిని అజోడికార్బొనమైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. ఇందులో బెంజాయిల్ పెరాక్సైడ్ రసాయనాన్ని చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదాలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. 
 
ఇలాంటి మైదా పిండితో తయారు చేసిన వంటకాలను ఆరగించడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.
 
మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 
 
సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments