Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్లిన జుట్టుకు చిట్కాలు...

జుట్టు చివర్ల చిట్లిపోవ‌డం వ‌ల్ల చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్నచిన్న తప్పులు కూడా కారణం అవుతాయి. జుట్టుని టవల్‌తో ఎక్కువగా రుద్ద కూడదు. తడి జుట్టుని దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెన

Webdunia
శనివారం, 23 జులై 2016 (20:22 IST)
జుట్టు చివర్ల చిట్లిపోవ‌డం వ‌ల్ల చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్నచిన్న తప్పులు కూడా కారణం అవుతాయి. జుట్టుని టవల్‌తో ఎక్కువగా రుద్ద కూడదు. తడి జుట్టుని దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగించాలి. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, విటమిన్ ఎ, సి, సెలీనియం వంటివి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. చిన్న చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
 
* ఒక కోడిగుడ్డు తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె, అరకప్పు పాలు కలపాలి. ఈ ప్యాక్‌ని తలకు మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే, చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.
* తలకు, మాడుకు బాగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు మెరుస్తూ, బలంగా, జుట్టు చివర్ల చిట్లిపోవడాన్ని అరికడుతుంది. కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్‌ని సమానంగా తీసుకోవాలి. మూడింటిని కలిపి తలకు పట్టించుకోవడానికి ముందు గోరువెచ్చగా చేయాలి. తర్వాత తల మాడుకి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు.
 
* బొప్పాయి గుజ్జును తీసుకొని దానికి పెరుగు మిక్స్ చేసి బాగా మెత్తగా చేయాలి. ఈ పేస్ట్ ను తల మాడుకు, జుట్టుకు పట్టించాలి. తర్వాత నిదానంగా మసాజ్ చేసి పది నిముషాలు ఉంచాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
* రెండు టేబుల్ స్పూన్ల తేనె, పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి పేస్ట్‌ను త‌లకు ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
* ఒక అరటిపండుని బాగా పేస్ట్ చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా రోజ్ వాటర్, కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్ ని తలకు మొదళ్ళ‌ నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
* ఒక అవొకాడో పండును గుజ్జులా తయారు చేసుకొని అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. ఇది చిట్లిన జుట్టుకు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తక్కువ పెట్టుబడి - అధిక లాభం పేరుతో ఆశ చూపి : నెల్లూరు మహిళ నుంచి రూ.2.46 కోట్లు స్వాహా!!

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

'లొంగిపో బిడ్డా... అందరం ప్రశాంతంగా బతుకుదాం' : ఉగ్రవాది కొడుక్కి తల్లి పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

తర్వాతి కథనం
Show comments