పాప్‌కార్న్ చికెన్ తయారీ విధానం..?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (11:24 IST)
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ ఫిల్లెట్ - 300 గ్రా
మొక్కజొన్నపిండి - 2 స్పూన్స్
గుడ్డు - 1
బ్రెడ్‌క్రంబ్స్, కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ (కచ్చాపచ్చాగా మిక్సీ చేసి)ల్లో వేటినైనా వాడొచ్చు - 1 కప్పు
ఉప్పు - సరిపడా
పసుపు - పావుస్పూన్
నూనె - సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ముప్పావు స్పూన్
నల్ల మిరియాలు - పావుస్పూన్
ఉల్లిపాయల పొడి - అరస్పూన్
గరం మసాలా - కొద్దిగా
కారం - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసి నీళ్లతో శుభ్రంగా కడిగి వడకట్టాలి. తరువాత కారం, నల్లమిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, ఉప్పును చికెన్ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డు, మొక్కజొన్న పిండి వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తరువాత బ్రెడ్ క్రంబ్స్‌ను వేసి కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఒక్కో ముక్కను బ్రెడ్ క్రంబ్స్‌లో వేసి దొర్లించొచ్చు. పావుగంట వాటిని అలానే ఉంచితే బ్రెడ్ పొడి ముక్కలకు బాగా అంటుకుపోతుంది. ఇప్పుడు నూనె వేడిచేసి అందులో ఈ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. మధ్యమధ్యలో కదుపుతూ వేగిస్తే ముక్కలు బాగా వేగుతాయి. అంతే... పాప్‌కార్న్ చికెన్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేము వీణ అనే మహిళకు ఎలాంటి అబార్షన్లు చేయలేదు: హాస్పిటల్ యాజమాన్యం

ఎమ్మెల్యే శ్రీధర్ ఇదివరకు వైసీపికి చెందినవారే, ఇప్పుడు జనసేన అంతే: బాధితురాలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌‍కు సిట్ నోటీసులు?

శ్రీవారి లడ్డూలులో కల్తీ నెయ్యి నిజమేనంటూ సిట్ సంచలన విషయాలు

Tirupati laddu: లడ్డూలో ఆ కొవ్వు లేదు.. చంద్రబాబు నేలపై ముక్కు రాసి క్షమాపణ చెప్పాలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

తర్వాతి కథనం
Show comments