కావలసిన పదార్థాలు:
సపోటా ముక్కలు - 2 కప్పులు
పాలు - 1 లీటర్
జెలటిన్ - 1 స్పూన్
కార్న్‌ఫ్లోర్ - 1 స్పూన్
తాజా క్రీమ్ - అరకప్పు
చక్కెర పొడి - 4 స్పూన్స్
తయారీ విధానం:
ముందుగా పావుకప్పు పాలు పక్కనుంటి మిగతావి నాన్‌స్టిక్ పాన్‌లో మరిగించాలి. తర్వాత మంట తగ్గించి 20 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఆపై మంట తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు పక్కనుంచిన పావుకప్పు పాలలో కార్న్‌ఫ్లోర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరిగించిన పాలలో కలిపి మళ్లీ పొయ్యి మీద ఉంచి ఆపకుండా కలుపుతూ పెద్ద మంటపై 5 నిమిషాలు మరిగించాలి.
తరువాత కొద్దిగా నీళ్లల్లో 2 స్పూన్ల జెలటిన్ నానబెట్టి పూర్తిగా కరిగేవరకూ పొయ్యి మీద వేడిచేసుకోవాలి. దీన్ని మరిగించిన పాల మిశ్రమంలో పోసి 3 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంటాయి. క్రీమ్, చక్కెర పొడి రెండూ స్పూన్‌తో గిలక్కొట్టాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లో గట్టిపడ్డ పాల మిశ్రమాన్ని తీసి బ్లెండర్‌లో వేసి తిప్పాలి. దీనికి గిలక్కొట్టిన క్రీమ్, సపోటా ముక్కలు, ఎసెన్స్ చేర్చి కలిపి సెట్ అయ్యేవరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి తింటే యమ్మీగా ఉంటుంది. అంతే సపోటా ఐస్‌క్రీమ్ రెడీ.