Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ మంచూరియా..?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (11:38 IST)
కావలసిన పదార్థాలు:
ఓట్స్ - 2 కప్పులు
క్యారెట్, క్యాబేజ్, కీరా - అరకప్పు
బీన్స్ - పావుకప్పు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 5
కొబ్బరి తురుము - పావుకప్పు
క్యాప్సికం - పావుకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అరచెంచా
సోయాసాస్ - అరస్పూన్
టమాటా కెచప్ - 3 స్పూన్స్
అజినోమోటో - కొద్దిగా 
ఉప్పు - అరచెంచా
నూనె - సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
 
తయారీ విధానం:
ముందుగా ఓట్స్‌ను వేయించుకుని పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో 2 స్పూన్ల నూనె వేడిచేసి క్యాప్సికం మినహా మిగిలిన కూరగాయముక్కలు, సగం ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఆపై కొద్దిగా వేగాక అందులో కొబ్బరి తురుము చేర్చుకోవాలి. ఈ మిశ్రమంలో ఓట్స్ పొడి, ఉప్పు కలిపి నీళ్లు చల్లి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో వేయించుకోవాలి.
 
నూనె ఎక్కువగా వద్దనుకుంటే ఆవిరిమీద కూడా ఉడికించుకోవచ్చు. ఆపై బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, తరుగు, అజినోమోటో చేర్చి వేయించి సోయాసాన్, టమోటా కెచెప్ కలుపుకోవాలి. చివరగా ఓట్స్ ఉండల్ని కూడా వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించి తీసి కొత్తిమీర చల్లుకోవాలి. అంటే ఓట్స్ మంచూరియా రెడీ.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments