Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి

విద్యావంతులలో చాలామంది అన్నీ తమకు తెలుసునని అనుకుంటారు. సత్యశోధన చేస్తారు. నిజమైన సత్యం యేసు బోధనలలోనే దొరుకుతుంది. దానిని ఎలా నీకొదేము అనే విద్యావేత్త పరిశోధించాడో తెలుసుకుందాం. యూదుల అధికారి నీకొదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన (యేసు)

Jesus Christ
Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (17:35 IST)
విద్యావంతులలో చాలామంది అన్నీ తమకు తెలుసునని అనుకుంటారు. సత్యశోధన చేస్తారు. నిజమైన సత్యం యేసు బోధనలలోనే దొరుకుతుంది. దానిని ఎలా నీకొదేము అనే విద్యావేత్త పరిశోధించాడో తెలుసుకుందాం. యూదుల అధికారి నీకొదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన (యేసు) యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవరును చేయలేరని ఆయనతో చెప్పెను. అందుకు యేసు కడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (యోహోను 3:1-4)
 
పరిసయ్యులు ఎవరు?
పరిసయ్యులు యూదా మత పెద్దలు. దేవుడు, మోషేల ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవారు. బాహ్య ప్రపంచానికి మాత్రం భక్తిపరులుగా కనిపిస్తారు. ధర్మశాస్త్రంలో, పాపంలో పట్టుబడిన వారు రాళ్ళతో కొట్టి చంపాలి. శరీరంలో ఏ భాగంతో పాపం చేస్తే, ఆ భాగాన్నీ నరికేసేవారు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అలాంటి మత పెద్దలలో నీకొదేము ఒకరు. యేసు చేసిన అద్భుతాలు, స్వస్థతలు చూసి ఆశ్చర్యపోయారు. 
 
ఆయన నిజంగా దేవుని ద్వారా సూచక క్రియలు చేస్తున్నారని నమ్మాలి. దేవుని రాజ్యంలో తానూ ప్రవేశించాలని ఆశతో యేసును విచారించడానికి వచ్చాడు. సమాజానికి భయపడి, అధికారియైన నీకొదేము రాత్రివేళ యేసు దగ్గరకు వెళ్ళాడు. యేసు బోధలను, సూచక క్రియలను వ్యతిరేకించిన వారిలో నీకోదేము ఒకరు. అతడు మదాధికారియైనా సత్యం తెలియని వ్యక్తి. ఆ సత్యాన్నీ తెలుసుకోవడానికే యేసు వద్దకు వచ్చాడు.
 
యేసే రక్షకుడని విశ్వసించాలి
యేసు తన దగ్గరకు వచ్చే ఎవరినైనా తిరిగి పంపరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసే రక్షకుడని హృదయంలో విశ్వసించి, నోటితో ఒప్పుకోవాలి. యేసు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో పాపాలను కడిగే శక్తి ఉన్నది. యేసుతో మాట్లాడి సత్యం తెలుసుకొన్నాడు నీకొదేము. ముసలి వాడయినను చీకటిలో వచ్చి, యేసు వాక్యపు వెలుగును పొందాడు. నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి అని పలికాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టేఫ్రీ- మెన్స్ట్రుపీడియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ, 10 లక్షలకు పైగా బాలికలకు అవగాహన

Pawan Kalyan Meets Chandrababu: బాబుతో పవన్ భేటీ.. వైఎస్సార్ పేరు తొలగింపు

AP Assembly Photo Shoot: పవన్ గారూ ఫ్రెష్‌గా వున్నారు.. ఫోటో షూట్‌కు హాజరుకండి: ఆర్ఆర్ఆర్ (video)

Roja: తప్పు మీది కాదు.. ఈవీఎంలదే.. కూటమి సర్కారుపై సెటైర్లు విసిరిన ఆర్కే రోజా

కాలేజీ ప్రొఫెసర్ కాదు కామాంధుడు.. విద్యార్థుల పట్ల అలా ప్రవర్తించి.. పోలీసులకు చిక్కాడు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

15-03-2025 శనివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

Chanakya Niti: భార్యాభర్తలిద్దరూ కలిసి చేయకూడని ఆ 4 పనులు.. ఏంటవి?

Lakshmi Jayanti : హోలీ రోజునే శ్రీలక్ష్మి జయంతి- శుక్రవారం వచ్చింది.. ఇవన్నీ చేస్తే ఐశ్వర్యం మీ సొంతం..

14-03-2025 శుక్రవారం రాశి ఫలితాలు - తలపెట్టిన కార్యం నెరవేరుతుంది.

Chanakya Niti: ఈ నాలుగు లేని చోట నివసించే వారు పేదవారే.. చాణక్య నీతి

తర్వాతి కథనం
Show comments