Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే వల్లే ధనవంతులు అయ్యారు.. కానీ, బీజేపీకి ఓట్లు వేస్తారా?

Webdunia
బుధవారం, 26 మే 2021 (17:56 IST)
తమిళనాడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే పీకే శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర చెన్నైలోని ఉత్తరాది వారు డీఎంకే పుణ్యమాని ధనవంతులు అయ్యారనీ, ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. 
 
ఇదే అంశంపై పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ, ఉత్తరాది వారు తమిళనాడులో జీవిస్తూ, ధనవంతులుగా మారారని, దానికి కారణం డీఎంకే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, కానీ ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. 
 
'ఉత్తరాది వారు ధనవంతులు కావడం నేను చూశాను. బీజేపీ వల్లేమీ కాదు. డీఎంకే వల్లే అయ్యారు. అయినా, మీరు మాకు ఓటు వేయలేదు. బీజేపీ వారికే వేశారు. అయినా మీరు మాకే ఓటు వేశారని అంటారు. మోసం చేస్తున్నారు' అని శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments