Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడండి.. మంత్రికి ద్రావిడ దేశం వినతి

తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారిందని, ఆ విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర విద్యామంత్రి కె.సెంగోట్టయ్యన్‌కు ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు కోరారు. ఇదేవిషయంపై ఆ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (16:53 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారిందని, ఆ విద్యార్థులను ఆదుకోవాలని రాష్ట్ర విద్యామంత్రి కె.సెంగోట్టయ్యన్‌కు ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు కోరారు. ఇదేవిషయంపై ఆయన సోమవారం మంత్రి సెంగోట్టయ్యన్‌ను కలిసి ఓ వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. 
 
2006లో డీఎంకే తీసుకొచ్చిన నిర్బంధ తమిళ విద్యా విధానం వల్ల పదో తరగతి చదివే మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లోని పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివే విద్యార్థులు, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వారివారి మాతృభాషల్లోనే రాసేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
 
ఇదే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాటి గవర్నర్ రోశయ్యలు కూడా ముఖ్యమంత్రి దివంగత జయలలితకు కూడా లేఖలు రాసి మైనార్టీ విద్యార్థులు వారివారి మాతృభాషల్లో పరీక్షలు రాసేలా అనుమతించాలని కోరినట్టు కృష్ణారావు పేర్కొన్నారు. అందువల్ల ఈ యేడాది కూడా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా తమతమ మాతృభాషలో పరీక్షలు రాసుకునేలా ఆదేశించాలని కోరారు. 
 
అంతేకాకుండా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ, ఎంబీసీ, మైనార్టీ ప్రజల సంక్షేమార్థ జారీ చేసిన జీవో నంబరు 83ను అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుగా తమిళనాడులో కూడా త్రిభాషా (మాతృభాష, ఇంగ్లీష్, తమిళం) విధానాన్ని అమలు చేయాలని కోరారు. 2017 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను తెలుగు విద్యార్థులు తెలుగు భాషలో రాసుకునేలా సహకరించాలని కోరారు. 
 
మైనార్టీ భాషల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కల్పించాలి. కృష్ణగిరి జిల్లాలో ఉన్న డైట్ కేంద్రంలో తెలుగు విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని వినతి పత్రంలో కోరారు. వీటితో పాటు అనేక డిమాండ్లను పరిష్కరించాలని ద్రావిడదేశం సమర్పించిన వినతిపత్రంలో కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments