Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడుంటే చంపేస్తారు.. చెన్నై జైలుకు మార్చండి : జైలు అధికారులకు శశికళ లేఖ

బెంగుళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారం అధికారులు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఓ లేఖ రాశారు. పర్పపణ అగ్రహార జైలులో తనకు ప్రాణహాని ఉందని, తాను ఇక్కడుంటే ఖచ్చితంగా చంపేస్తారని, అంద

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (15:57 IST)
బెంగుళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారం అధికారులు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఓ లేఖ రాశారు. పర్పపణ అగ్రహార జైలులో తనకు ప్రాణహాని ఉందని, తాను ఇక్కడుంటే ఖచ్చితంగా చంపేస్తారని, అందువల్ల తనను చెన్నై జైలుకు మార్చాలంటూ ఆమె సోమవారం ఓ లేఖ రాశారు. 
 
ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. దీంతో ఆమె పరప్పణ అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఈ జైలుల్లో తనకు ప్రాణహాని ఉందని, పైగా, తనకు ఇక్కడి వాతావరణం కూడా పడటం లేదని ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
ఈ లేఖను అందుకున్న జైలు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే, చెన్నై జైలు అధికారులతో చర్చలు జరిపిన తర్వాత శశికళను మరో జైలుకు మార్చే విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరిన శశికళ.. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేస్తూ తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో జీవితం గడుపుతున్నారు. 
 
దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్పందించారు. జైలులో శశికళకు ఎలాంటి ప్రాణహాని లేదని స్పష్టం చేశారు. ఆమెకు తగిన భద్రతను కల్పించివున్నారనీ, పైగా, ఇతర ఖైదీలతో కూడా ఆమెకు ఎలాంటి ముప్పు లేదని ఐబీ అధికారులు వెల్లడించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments