Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1720 ఉద్యోగ అవకాశాలు

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (14:27 IST)
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రిఫైనరీస్ డివిజన్‌లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 1720 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఐవోసీకి చెందిన గౌహతి, బరౌనీ, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్ ప్రాంతాల్లోని శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
 
ఇందులో ట్రేడ్ అప్రెంటిస్ విభాగంలో మొత్తం 869 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, మెకానికల్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో 851 ఖాళీలు ఉండగా, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన వారు పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత ట్రేడ్/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 2023 అక్టోబరు 31 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపిక రాత, వైద్య పరీక్షలు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా నిర్వహిస్తారు. వచ్చే నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://iocl.com/apprenticeships అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments