అమరావతి : వచ్చే నెల 30వ తేదీన డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 10 తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చ
అమరావతి : వచ్చే నెల 30వ తేదీన డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 10 తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
వచ్చే నెల 30న రాత పరీక్ష, జనవరి 3, 2019న ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఈ డీఎస్సీ ద్వారా 9,275 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తరవాత డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.