Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఏపీఎఫ్‌లో కమాండెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (18:12 IST)
కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 322 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలలో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఏ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి మే 16న సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
 
మొత్తం ఉద్యోగాలు 322 పోస్టులు ఉండగా, బీఎస్‌ఎఫ్‌లో (86), సీఆర్‌పీఎఫ్‌ (55), సీఐఎస్‌ఎఫ్‌ (91), ఐటీబీపీ (61), ఎస్‌ఎస్‌బీ (30)  చొప్పున ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. అభ్యర్థులు డిగ్రీ తత్సమాన విద్యార్హతలతో పాటు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి. జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 
 
అర్హులైన వారు మే 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 17 నుంచి 23వరకు సరిచేసుకొనేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫీజు రూ.200లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు కల్పించారు. రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్‌లో ఉండే పరీక్షకు నెగెటివ్‌మార్కులు ఉంటాయి. రాత పరీక్ష ఆగస్టు 6న జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో సెంటర్లు ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments