Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్‌- ఉబెర్‌లో 140 మందికి ఉద్యోగాలు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (21:12 IST)
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కరోనా సమయంలో భౌతిక దూరాన్ని ప్రోత్సహించేలా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం, మార్కెట్‌లోకి ఆన్‌బోర్డ్ రెస్టారెంట్ మెనూలకు సంబంధించి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల అభివృద్దికి పెట్టుబడులు పెడుతున్నామని ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజా నియామకాలు జరగనున్నాయి. 
 
ఇందులో భాగంగా కొత్తగా 140 మంది నియమించుకోనున్నట్లు ప్రకటించింది. డెలివరీ, మార్కెట్ ప్లేస్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కంప్లైయెన్స్, సేఫ్టీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాలలో ఈ నియామకాలుంటాయని ఉబెర్ సంస్థ వెల్లడించింది.
 
ఇటీవల భారీగా ఉద్యోగులను తొలగించిన ఉబెర్ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇంజనీర్ల నియామకాలవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 140 మంది ఇంజనీర్లను ఎంపిక చేస్తామని ఉబెర్ సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్ జయరామ్ వల్లియూర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments