తెలంగాణ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షా హాల్ టిక్కెట్లు విడుదల

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (14:28 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షా 2022లకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (హాల్ టిక్కెట్స్)ను తాజాగా విడుదల చేసింది. గ్రూపు-1 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు tspsc.gov.in లేదా https://scroll.in/announcements/1023063/tspsc-group-1-recruitment-2022-application-opens-today-for-503-posts అనే లింకు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఈ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. 
 
కాగా, ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్ట్‌కు ఏకంగా 756 మంది పోటీపడుతున్నారన్నమాట. 
 
ఇంతటి పోటీ నెలకొన్న సందర్భంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలను చాలా పకట్బందిగా నిర్వహించనుంది. అక్టోబర్‌ 16న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments