Webdunia - Bharat's app for daily news and videos

Install App

డౌన్‌లోడ్‌కు సిద్ధంగా TSLPRB Police Constable Hall Ticket 2022

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (11:41 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 28వ తేదీన రాత పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను (హాల్ టిక్కెట్స్) ఈ నెల 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. వీటిని 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు https://www.tslprb.in/ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాస రావు తెలిపారు. 
 
ఈ నెల 28వ తేదీన జరిగే రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఏవేని సమస్యలు తలెత్తిన పక్షంలో support@tslprb.in కు ఈమెయిల్‌ లేదా 9393711110, 9391005006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments