Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి తెలంగాణాలో టెట్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్

Advertiesment
నేటి తెలంగాణాలో టెట్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్
, సోమవారం, 6 జూన్ 2022 (10:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్షకు చెందిన హాల్ టిక్కెట్లను డౌన్ లోడు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ టెట్ ప్రవేశ పరీక్ష ఈ నెల 12వ తేదీన రెండు సెషన్‌లలో జరుగనుంది. 
 
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఈ పరీక్షకు సంబంధించి www.tstet.cgg.gov.in అనే వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా, తొలి పేపర్‌‍కు 3,51,468 మంది, రెండో పేపర్‌కు రూ.2,77,884 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాకినాడ ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం - పశువులను వేటాడుతూ..