Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాకినాడ ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం - పశువులను వేటాడుతూ..

tigeer
, సోమవారం, 6 జూన్ 2022 (10:02 IST)
ఏపీలోని కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు ఓ పెద్ద పులి హల్చల్ చేస్తుంది. ఆ ప్రాంతంలోని పశువులను వేటాడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారికి పగలూ రాత్రి కంటిమీద కనుకులేకుండా చేస్తుంది. ఈ పెద్ద పులిని బంధించేందుకు అధికారులు నిద్రహారాలుమాని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
కానీ, వారిని ముప్పతిప్పలు పెడుతూ తన పనిని విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఇదే పరిస్థితి గత రెండు వారాలుగా ప్రజలను హడలెత్తిస్తుంది. ఈ పులిని పట్టుకునేందుకు మూడు చోట్ల బోనులు పెట్టినప్పటికీ అది పట్టుబడటం లేదు. ఒకచోటు బోనులోకి వెళ్లకుండానే వెనుదిరిగిపోయింది. దీంతో ఏం చేయాలో అధికారులకు దిక్కుతోచడం లేదు. 
 
ఈ మండలంలోని పొదురుపాక, శరభవరం, వొమ్మంగి ప్రాంతాల్లో ఈ పెద్దపులి యధేచ్చగా సంచరిస్తూ, పశువులను వేటాడుతూ స్థానికుల కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. దీన్ని పట్టుకునేందుకు అధికారులు మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. కానీ, అది బోనులో చిక్కకుండా అధికారులకే చుక్కలు చూపిస్తుంది. 
 
మాసం ఎరవేసినప్పటికీ అది బోనులోకి వెళ్లకుండా అధికారులను తీవ్ర నిరాశకు లోనుచేస్తుంది. కాగా, ఆ పులి వయసు నాలుగైదేళ్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఈ పెద్దపులి సంచరించడాని ప్రధాన కారణంగా పుష్కలంగా ఆహారం, నీళ్లు లభించడమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసులో కీలక ఆధారాలు స్వాధీనం