శ్రీవేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇవి ఆగస్టు నెలకు సంబంధించిన సేవా టిక్కెట్లు. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార టిక్కెట్ల కోటాను ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు.
అలాగే, సుప్రభాతం, తోమాల, అర్జన టిక్కెట్లతో పాటు జూలై నెలకు సంబంధించిన అష్టదళ పాదపద్మారాధన సేవా టిక్కెట్లెను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తుండగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ ద్వారా డిప్ సేవా టిక్కట్లు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
మరోవైపు, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన వర్చువల్ కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ టిక్కెట్ల కోటా బుధవారం విడుదల చేయనున్నారు.