Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24-05-2022 మంగళవారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా...

Karkataka Rashi
, మంగళవారం, 24 మే 2022 (04:00 IST)
మేషం :- ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. కార్మికులకు ఆందోళన అధికమవుతుంది. ప్రత్యర్ధులు మీ ఉన్నతిని, సమర్థతను గుర్తిస్తారు. స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు కలిసిరావు.
 
వృషభం :- కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. వృత్తి, ఉద్యోగాలపట్ల ఆసక్తి చూపుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు.
 
మిథునం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సమయస్పూర్తితో వ్యవహరించడం మంచిది. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య దాపరికం వివాదాస్పదమవుతుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతంకూడదు.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
సింహం :- వృత్తుల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు.
 
కన్య :- వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థుల ఆలోచనలు కొత్త మలుపు తిరుగుతాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం.
 
తుల :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఇతరుల వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవద్దు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతులకు ఇక్కట్లు అధికమవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. ప్రతి విషయంలోను మీవైఖరిని స్పష్టంగా తెలియజేయండి.
 
వృశ్చికం :- పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. బంధువులు, కుటుంబీకులకు మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
ధనస్సు :- లైసెన్సులు, పర్మిట్ రెన్యువల్లో జాప్యం వద్దు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. విదేశీ ప్రయాణాలు వాయిదా పడుట వల్ల ఆందోళన చెందుతారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం కదలికలను గమనిస్తుండాలి. సేవా, ఆధ్యాత్మిక సంస్థల్లో సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు.
 
మకరం :- ఆర్థిక ప్రణాళికలు లాభిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తిపరంగా ప్రజాసంబంధాలు విస్తరిస్తాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది.
 
కుంభం :- దంపతులు మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. పొగడ్తలు, ముహమ్మాటాలకు దూరంగా ఉండాలి. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలోను, సంఘంలోను మీ మాటకు గౌరవం లభిస్తుంది.
 
మీనం :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం రాక కోసం ఎదురు చూస్తారు. ఊహగానాలతో కాలం వ్వర్గం చేయక సత్ కాలంను సద్వినియోగం చేసుకోండి. మధ్యవర్తిత్వం వహించుట మంచిది కాదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-05-22 సోమవారం రాశిఫలాలు ... వరసిద్ధి వినాయకుడిని గరికెతో..