Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ 2022 తేదీల వెల్లడి

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:02 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ కౌన్సెలింగ్ 2022 తేదీలను వెల్లడించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అక్టోబరు 10వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 
 
సోమవారం వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. అక్టోబరు 10 నుంచి 15వ తేదీన వరకు వెబ్ ఆప్షన్లును ఎంచుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్టోబరు 18 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అభ్యర్థులకు తొలి విడత కౌన్సెలింగ్ కేటాయింపు జరుగుతుంది. 
 
చివరి విడత కౌన్సెలింగ్ అక్టోబరు 23వ తేదీ నుంచి మొదలుకానుంది. తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు 23 నుంచి 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్టోబరు 28వ తేదీన ఎంబీఐ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. కాగా, ఈ ఐసెట్ కౌన్సెలింగ్ అక్టోబరు 10వ తేదీ నుంచి ప్రారంభమై అదే నెల 28వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments