Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కెరీర్ గ్రోత్ సెమినార్‌: సింబియోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ సిల్వర్ జూబ్లి

ఐవీఆర్
ఆదివారం, 6 జులై 2025 (18:31 IST)
భారతదేశంలోని ప్రముఖ స్వయంప్రతిపత్తి దూర విద్యా సంస్థలలో ఒకటైన సింబయోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఎస్సిడిఎల్ ) తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించింది. తమ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో భాగంగా, హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో మధ్య ప్రత్యేక కెరీర్ గ్రోత్ సెమినార్ నిర్వహించింది .
 
ఈ కార్యక్రమానికి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, ప్రారంభ, మధ్యస్థ కెరీర్ నిపుణులు, హెచ్ ఆర్ నిపుణులు, పూర్వ విద్యార్థుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తమ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా తమ పూర్వ విద్యార్థులను సత్కరించడానికి ఒక అవార్డుల ప్రదానోత్సవంను సైతం సంస్థ నిర్వహించింది. డేల్ కార్నెగీ రచించిన "హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్" అనే పుస్తకం యొక్క కాలాతీత సూత్రాల నుండి ప్రేరణ పొంది ప్రత్యేక డేల్ కార్నెగీ లీడర్‌షిప్ మాస్టర్‌క్లాస్‌ను సెమినార్‌లో భాగంగా నిర్వహించారు. ఈ సదస్సు భావోద్వేగ మేధస్సు, ప్రభావం, నమ్మకాన్ని పెంపొందించడం గురించి కీలకమైన పరిజ్ఞానం అందించింది.
 
మరింత వివరంగా చెప్పాలంటే, ఈ సెమినార్‌కు హాజరైనవారు ప్రభావవంతమైన కమ్యూనికేషన్, సంబంధాలను పెంపొందించే కళపై ఆచరణాత్మక పరిజ్ఞానం పొందారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంభాషణలను తక్షణమే మెరుగుపరిచే నైపుణ్యాలైనటువంటి ఎదుటి వారిని వాస్తవమైన రీతిలో ప్రశంసించటం, చురుకైన శ్రవణం ద్వారా ఇతరులను విలువైన వారిగా భావించేలా చేయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ సెషన్ సహాయపడిందని చాలా మంది వెల్లడించారు. సానుభూతి ప్రాధాన్యత, విమర్శలను నివారించడం, సానుకూల బలోపేతం ద్వారా ఇతరులను ప్రభావితం చేయడం పాల్గొన్న వారిలో బలంగా ప్రతిధ్వనించింది, తమ  దైనందిన జీవితంలో మరింత నమ్మకంగా, ఒప్పించేవారిగా , భావోద్వేగపరంగా తెలివైనవారిగా మారడానికి వారికి శక్తినిచ్చింది.
 
ఇతర కీలక సెషన్లలో హెచ్ఆర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, ఇక్కడ హెచ్ఆర్ నిపుణులు భవిష్యత్తులో పని వాతావరణం ఎలా ఉంటుంది , డిఈఐ మరియు డిజిటల్ పరివర్తన వంటి కీలక అంశాలను చర్చించారు. పెరుగుతున్న అవకాశాలపై విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం వ్యక్తిగతీకరించిన కెరీర్ కౌన్సెలింగ్ సెషన్ కూడా జరిగింది.
 
ఈ కార్యక్రమంలో ఎస్సిడిఎల్  చీఫ్ ఆపరేషన్స్ నిఖిల్ వైద్య, ఎస్ సిడి ఎల్ కార్పొరేట్ హెడ్ ఆశిష్ పండిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ వైద్య మాట్లాడుతూ, " ఈ సెమినార్ కీలకమైన పరిశ్రమ మార్పులపై అవగాహన కల్పించింది.  మధ్య మరియు సీనియర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలలో నైపుణ్యం పెంచడం, క్రాస్-ఫంక్షనల్ నైపుణ్యం మరియు చురుకైన నాయకత్వం కోసం పెరుగుతున్న అవసరాన్ని వెల్లడించింది" అని వివరించారు. ఆరోగ్య సంరక్షణ, మేనేజమెంట్ మరియు విద్యలో కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న డొమైన్‌లకు విస్తరించే ప్రణాళికలతో పాటుగా ఇన్‌స్టిట్యూట్ యొక్క భావి ప్రణాళికలను కూడా ఆయన వివరించారు. పాఠ్యాంశాలను సుసంపన్నం చేయడం , వాస్తవ ప్రపంచ పరిశ్రమ డిమాండ్‌లకు అనుగుణంగా దానిని మరింత దగ్గరగా తీర్చిద్దిదడం  లక్ష్యంగా కొత్త కార్పొరేట్ సహకారాలు కూడా జరుగుతున్నాయని ఆయన అన్నారు.
 
25 సంవత్సరాల శ్రేష్ఠతను వేడుక జరుపుకుంటూ నిర్వహిస్తోన్న ఎస్సిడిఎల్ యొక్క సిల్వర్ జూబ్లీ సంబరాలలో భాగంగా దేశవ్యాప్తంగా కెరీర్ గ్రోత్ సెమినార్ల శ్రేణిని నిర్వహిస్తోంది. ఈ హైదరాబాద్ సెమినార్ ఈ సిరీస్ యొక్క ముఖ్యాంశాలలో ఒకటి, ఇది భారతదేశం అంతటా విద్యార్థులు మరియు నిపుణులకు విలువైన మరియు ఉచిత అభ్యాస అవకాశాన్ని అందించింది. భారతదేశంలోని ప్రముఖ స్వయంప్రతిపత్తి దూర విద్యా సంస్థలలో ఒకటిగా, ఎస్సిడిఎల్ 1 మిలియన్ కంటే ఎక్కువ మంది అభ్యాసకులకు నాణ్యమైన విద్యను అందించింది. ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా  80,000+ మంది విద్యార్థులను కలిగి వుంది. ఈ సంస్థ గ్రాడ్యుయేట్లు మరియు వృత్తి నిపుణుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన పరిశ్రమ-సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మరియు సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల విస్తృత శ్రేణిని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments