Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల

Webdunia
బుధవారం, 28 జులై 2021 (13:34 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. 
 
ఈ ఫలితాలను polycetts.nic.in, sbtet.telangana.gov.in, www.dtets.cgg.gov.in లో పాలిసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం, పాలిసెట్ బైపీసీ విభాగంలో 76.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 92,557 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 
 
ఇదిలావుంటే, ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్‌ ఛైర్మన్‌ నవీన్‌మిత్తల్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14న కేటాయిస్తారు. విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలవుతుంది. నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. 
 
ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు జరగనున్నాయి. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ నిర్వహిస్తారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. 
 
23న తుది విడత పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 
 
ఆగస్టు 27న రెండో విడత పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 1న నుంచి పాలిటెక్నిక్‌ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. సెప్టెంబరు 9న స్పాట్ ప్రవేశాలకుగాను మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments