Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

Advertiesment
తెలంగాణాలో నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ
, బుధవారం, 28 జులై 2021 (10:05 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జీవాల పంపిణీకి పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టనున్నారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు నేతృత్వంలో లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుంది. 
 
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 81 వేల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కరోనా కారణంగా రాష్ట్రంలో నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ముఖ్యమంత్రి ఆదేశాల బుధవారం నుంచి జీవాల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుంది. 
 
ఇందుకోసం ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. 
 
రెండో విడతలో రాష్ట్రంలో 3 లక్షల 81 వేల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 6 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఒక గొర్రెల యూనిట్ ధర గతంలో లక్షా 25 వేల రూపాయలుండగా... పెరిగిన ధరలు, లబ్ధిదారుల విజ్ఞప్తుల మేరకు దానిని లక్షాల 75 వేలకు పెంచారు. 
 
సుమారు 6 వేల కోట్లు వెచ్చించి... రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8వేల 109 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 7లక్షల 61వేల 898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జలాంతర్గామిగా మారిన కారు.. ప్రయోగం విజయవంతం