Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.ఐ.టి వరంగల్‌లో 3 వేల లోపు ర్యాంకులకే కంప్యూటర్‌ సైన్స్‌ సీటు

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (12:34 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌)లో సీటు పొందడానికి జనరల్‌ కేటగిరీ బాలురు (తెలంగాణ) 3,089 లోపు ర్యాంకు సాధించాల్సి ఉంటుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాలికలకు 3,773 లోపు జాతీయ ర్యాంకు తప్పనిసరి. గత విద్యాసంవత్సరం(2021) జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కటాఫ్‌ ర్యాంకులను బట్టి ఇది స్పష్టమవుతోంది. 
 
ఈ సారి పోటీని బట్టి కొద్దిగా అటుఇటుగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడైన విషయం తెలిసిందే. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లను ఆ ఎన్‌ఐటీ ఉన్న రాష్ట్రం(హోం స్టేట్‌)లోని విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తారు. ఈ లెక్కన ఎన్‌ఐటీ వరంగల్‌లోని సగం సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇస్తారు. మిగిలిన సీట్లకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు పోటీపడొచ్చు.
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఐటీ ఏర్పాటైనందున ఆ రాష్ట్ర విద్యార్థులకు ఇప్పుడు వరంగల్‌లో ‘హోం స్టేట్‌ కోటా’ లేదు. ఓపెన్‌ కోటా విద్యార్థులకు 55 వేల ర్యాంకు వచ్చినా ఎన్‌ఐటీ వరంగల్‌లో సీటు(ఏ కోర్సులోనైనా..) వస్తుంది. ఉదాహరణకు.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌ ఫిజిక్స్‌లో 55,819 ర్యాంకుకు ఓపెన్‌ కేటగిరీలో సీటు దక్కుతుంది. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో 24 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments