Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రియా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ 2023, సుచిత్ర ఎల్లా-సుజాతా రావులకు డాక్టరేట్ ప్రదానం

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:10 IST)
క్రియా విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీలో ఉన్న దాని క్యాంపస్‌లో కాన్వొకేషన్ వేడుకను నిర్వహించింది. కాన్వొకేషన్ వేడుక UG కోహోర్ట్ ఆఫ్ SIAS (స్కూల్ ఆఫ్ ఇంటర్‌వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) (2023), SIASలో PG డిప్లొమా, (2023) IFMR GSB (గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో 2-సంవత్సరాల MBA (2023)), IFMR GSB (2023)లో 3 సంవత్సరాల L&T MBA, క్రియా విశ్వవిద్యాలయం మరియు మద్రాస్ విశ్వవిద్యాలయం (2023)లో PhD కి అవార్డులు మరియు డిగ్రీలను ప్రదానం చేసింది.
 
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయడం జరిగింది, వారిలో సుజాత రావు, మాజీ కేంద్ర కార్యదర్శి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, GOI జాతీయంగా-అంతర్జాతీయంగా ఆరోగ్య సేవలకు ఆమె చేసిన కృషికిగాను; సుచిత్రా ఎల్లా, సహ వ్యవస్థాపకురాలు, భారత్ బయోటెక్ వైద్య శాస్త్రం మరియు పరిశోధన ప్రపంచానికి ఆమె చేసిన కృషికి గాను వారు ఈ గౌరవాన్ని పొందారు.
 
క్రియా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఎన్ వఘుల్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిర్మలరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కపిల్ విశ్వనాథన్, IFMR GSB డీన్ ప్రొఫెసర్ లక్ష్మీ కుమార్, సియాస్ అకాడమిక్ డీన్ డాక్టర్ పృథ్వీ దత్తా శోభి మరియు క్రియా కమ్యూనిటీలోని ఇతర సభ్యుల సమక్షంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిర్మలరావు, ఇలా అన్నారు, “ఈ సంవత్సరం, మేము రికార్డు స్థాయిలో విద్యార్థులను గ్రాడ్యుయేట్ చేస్తున్నాము. వాస్తవానికి, విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సభ్యులుగా, మేము విద్యా సంబంధిత విజయానికి ప్రాధాన్యతనిస్తాము, అయితే ఇక్కడ క్రియా విశ్వవిద్యాలయంలో, మేము ప్రపంచవ్యాప్త ఆందోళనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తాము. క్రియా విశ్వవిద్యాలయంలో కమ్యూనిటీల సామాజిక మరియు ఆర్థిక పురోగతి యొక్క సవాళ్లను పరిష్కరించడానికి మనస్తత్వం, సంకల్పం, నైపుణ్యాలు మరియు రిసోర్సులను కలిగి ఉన్న భావితరాల నాయకులను తయారుచేయడం పౌర సంబంధిత మరియు విద్యాపరమైన లక్ష్యం. మా విద్యార్థులు అసాధారణమైన ప్రతిభ, సామర్థ్యం మరియు మేధస్సును కలిగి ఉన్నారు మరియు మా గ్రాడ్యుయేట్లలో ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేకమైన స్వంత మార్గాల్లో ఈ విశ్వవిద్యాలయాన్ని సుసంపన్నం చేసారు.
 
వారి జీవితంలో ఈ డిగ్రీ అతి ముఖ్యమైన మైలురాయి. క్రియా విశ్వవిద్యాలయంలో వారి అధ్యయనాలు వారిని వారి సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాయి, ఆ క్రమశిక్షణ వారిని అత్యుత్తమ స్థితిలో ఉంచుతుంది మరియు అనేక సందర్భాల్లో, ఉన్నత స్థాయి అవగాహనను స్థాపించడానికి ఆ పరిమితులను విస్తరించాయి.”ట్టభద్రులను ఉద్దేశించి, శ్రీ గోపాలకృష్ణ గాంధీ, ఇలా అన్నారు. 'ఈనాటి మీ సంతోషం రేపు అనేక పరిస్థితులకు ఒక మార్గంగా ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. వారిలో చాలా మందికి ఒక పని అవసరం కాబట్టి, ‘క్వె సెరా సెరా లేదా వ్వాట్ విల్ బి విల్ బి' అనేది సమాధానం కాకూడదు. మన గొప్ప చరిత్ర ప్రకారం మీరు ‘వ్వాట్ విల్ బి విల్ బి' అనేదానికి జోడించడానికి తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది. జరగబోయేది జరగనివ్వండి, కానీ మీరు మీ మనస్సు ఏమి చెబుతుందో అది చేయండి, అని మన గొప్ప గీత చెబుతుంది. దీర్ఘకాలంగా విస్మరించబడిన పెద్ద పెద్ద సమస్యలు యువకులు తీసుకున్న చర్యల ద్వారా చాలా తరచుగా పరిష్కరించబడతాయి. మీరంతా చాలా చీకటిగా వుండే రాత్రిని ప్రకాశవంతం చేసే మెరుపు గల నక్షత్రాల వంటివారు.”

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments