Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెఎల్‌హెచ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సాంకేతిక నిర్వహణ శ్రేష్ఠత- సాంస్కృతిక వైభవం

ఐవీఆర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (20:46 IST)
కెఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్ తన అజీజ్ నగర్ క్యాంపస్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వార్షిక టెక్నో-కల్చరల్ ఫెస్ట్ అవిన్య 2024 విజయవంతంగా ముగించింది. ప్రతిభ- సృజనాత్మకత యొక్క శక్తివంతమైన ప్రదర్శన కోసం విద్యార్థులు, ఆవిష్కర్తలు, కళాకారులను ఒకచోట చేర్చడంతో పాటుగా సాంకేతికత, సంస్కృతిని కలిపే ఈ రెండు-రోజుల కార్యక్రమాన్ని వైభవంగా వేడుక జరుపుకుంది.
 
ఐక్యు క్విజ్, డేటా ఆల్కెమీ, స్కావెంజర్ హంట్, చాట్టర్ బాట్ వంటి సాంకేతిక-కేంద్రీకృత పోటీలతో మొదటి రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి, పాల్గొనేవారికి ఉత్సాహ పూరితంగా మేధోపరమైన సవాళ్లను అందించాయి. ప్రాజెక్ట్ ఎక్స్‌పో, వినూత్న ఆవిష్కరణను ప్రదర్శించింది. ఏస్‌కోడర్‌లో బిటెక్ విద్యార్థులు తమ అధునాతన కోడింగ్ సొల్యూషన్లను ప్రదర్శించారు. శ్వేషిక్ రెడ్డి, లక్కీ కుమార్‌లు సాఫ్ట్‌వేర్ విభాగంలో గెలుపొందారు. జి. సిద్దార్థ, రోహన్‌లచే Flask-ఆధారిత అప్లికేషన్ ఫర్ ఫేస్ రికగ్నిషన్ ఈ విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది. హార్డ్‌వేర్‌లో, లక్ష్మి, మేఘన, నౌషీన్‌ల అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు అత్యున్నత బహుమతిని పొందగా, విద్యార్థులు జి. నందిని, కె. హర్షిత, ఎం. అమృత, కె. నాగరాణి, ఎం. మనోగ్నల బృందం యాంటీ థెఫ్ట్ ఫ్లోరింగ్ సిస్టమ్ వాస్తవ-ప్రపంచ అనువర్తనాలు, సాంకేతిక సృజనాత్మకత రెండింటినీ ప్రదర్శిస్తూ రెండవ స్థానాన్ని పొందింది.
 
రెండవ రోజు, నృత్యం, సంగీతం, డీజే నైట్‌తో సాంస్కృతిక కార్నివాల్‌గా క్యాంపస్ మారింది, వేడుకలలో పాల్గొనేవారికి కళాత్మక వ్యక్తీకరణ వేదికగా ఇది నిలిచింది. ప్రముఖ నటులు షఫీ, కిరణ్ అబ్బవరం, కల్లు కొంపౌండ్ సినిమా బృందంతో పాటు నటుడు గౌతమ్, మరికొందరు హాజరు కావడం వేడుకలకు సినిమా వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులలో ముఖ్య అతిథి శ్రీ మురళి బొమ్మినేని, గౌరవ అతిథి, వియ్ హబ్ (తెలంగాణ ప్రభుత్వం యొక్క కార్యక్రమం)లో భాగస్వామి సంబంధాలు, కమ్యూనికేషన్స్ హెడ్ శ్రీమతి శాంతల పాల్గొనటంతో పాటుగా హాజరైన వారందరికీ స్ఫూర్తినిచ్చారు. 
 
ఇదే వేడుకల్లో భాగంగా, కెఎల్‌హెచ్ బాచుపల్లి క్యాంపస్ కొత్త విద్యా సంవత్సరాన్ని నోవస్ పేరిట ఉత్సాహంగా స్వాగతిస్తూ, ఆటలు, విద్యార్థుల ప్రదర్శనలతో సాంస్కృతిక వైభవంగా నిర్వహించింది. నటుడు నారా రోహిత్, అక్షర్ బృందం పాల్గొనటంతో పాటుగా 'కమిటీ కుర్రోళ్లు' యొక్క ప్రత్యేక ప్రదర్శనలను సైతం చేసింది. 
 
కెఎల్‌ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్ధ సారధి వర్మ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మా క్యాంపస్‌లన్నింటిలో ప్రదర్శించబడిన ఉత్సాహం, వినూత్న స్ఫూర్తి సంపూర్ణ విద్యా అనుభవాన్ని పెంపొందించడంలో ఇటువంటి సంఘటనలు పోషించే కీలకమైన పాత్రను వెల్లడించాయి. మా విద్యార్థుల సాంకేతిక, సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే వేదికను మాత్రమే మేము అందించటమే కాకుండా వారి అభ్యాసం, వ్యక్తిగత వృద్ధిని మెరుగుపరిచే, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే ప్లాట్‌ఫారమ్‌లను అందించడం మాకు గర్వకారణం.
 
కెఎల్‌హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. రామకృష్ణ, కెఎల్‌హెచ్ బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కోటేశ్వరరావు, సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారులతో పాటు ఈవెంట్ కన్వీనర్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూశారు. సమగ్ర అభివృద్ధి, అభ్యాసం కోసం విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments