Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్ ఫలితాలు రిలీజ్ - ఎన్.టి.ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (09:30 IST)
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి సెషన్ పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్.ఐ.టీలలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ తొలి విడుదల పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు జరిగిన విషయం తెల్సిందే. 
 
ఈ పరీక్షలకు జేఈఈ చరిత్రలోనే 95.8 శాతం మంది అంటే 8.22 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ) వీటి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.in లేదంటే ntaresuts.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడొచ్చు. 
 
కాగా, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ ఆరో తేదీన నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. రెండో సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారాన్ని https://jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ సెషన్ పరీక్షల సిట్ స్లిప్‌లను మార్చి 3వ తేదీన విడుదల చేయనుండగా చివరి వారంలో అడ్మిట్ కార్డులను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments