Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా భారత బుడ్డోడు

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (20:05 IST)
అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే స్పెల్లింగ్ బీ పోటీలు ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. స్పెల్లింగ్ బీ కాంటెస్ట్‌లో అనేక పదాలకు స్పెల్లింగ్‌లను చెప్పాల్సి ఉంటుంది. ఇందులో చాలా రౌండ్‌లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌లో గెలుస్తూ ఫైనల్ స్టేజ్‌కు వెళ్లి ఆ రౌండ్‌లో అడిగిన అక్షరాల స్పెల్లింగ్‌ను సరిగ్గా చెప్పిన వారికి స్పెల్లింగ్ బీ ప్రైజ్‌ను అందిస్తారు. అయితే ఈ కాంటెస్ట్‌లో 14లోపు వయసున్న పిల్లలు మాత్రమే పాల్గొనాలి.
 
కాగా భారతదేశానికి చెందిన నవనీత్ మురళి అనే బాలుడు ఈ స్పెల్లింగ్ బీ పోటీల్లో అరుదైన ఘనతను సాధించాడు. ప్రతి ఏడాది అమెరికాలో నిర్వహించే స్పెల్లింగ్ బీ పోటీలను ఈ ఏడాది కూడా ఐదు ప్రాంతాలలో నిర్వహించగా నవనీత్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఫ్లిప్ (FLIPE) అనే అక్షరం స్పెల్లింగ్ కరెక్ట్‌గా చెప్పడంతో నవనీత్ మూడు వేల డాలర్ల (రూ. 2 లక్షల 14 వేలు) ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. 
 
కాగా, ప్రణవ్ నందకుమార్ (13), వయుణ్ కృష్ణ (12) తదితరులు రన్నరప్‌లుగా నిలిచారు. దేశవ్యాప్తంగా ఎందరో పిల్లలు ఈ కాంటెస్ట్‌లో పాల్గొంటున్నారని.. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్తామని స్పెల్లింగ్ బీ ఫౌండర్ రాహుల్ వాలియా తెలిపారు. గెలిచిన వారందరికి ఆయన అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments