కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం సీయూఈటీ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (15:23 IST)
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశానికి సంబంధించి సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆరు విడతలుగా నిర్వహించనుంది. యూజీ కోర్సుల కోసం ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 
 
ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగో విడత పరీక్ష జరుగుతుంది. ఇందులో దేశ వ్యాప్తంగా 3.72 లక్షల మంది విద్యార్థులు పాల్గొనున్నారు. అయితే వివిధ కారణాల రీత్యా అనేక పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ రద్దు చేసింది. దీంతో సుమారుగా 11 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దూరం కానున్నారు.
 
వీరిందరికీ ఈ నెల 30 ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. వారంతా తమకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. కాగా, షెడ్యూల్‌ ప్రకారం సీయూఈటీ యూజీ పరీక్షలు ఈనెల 28న ముగియాల్సి ఉన్నది. అయితే తాజాగా చివరిదైన ఆరో విడత పరీక్షలను ఆగస్టు 24 నుంచి 30 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది.
 
ఇప్పటికే రెండో విడత సందర్భంగా కొన్ని పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అదేవిధంగా కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎత్తివేసింది. ఈ కారణంతో పరీక్ష రాయలేకపోయిన వారికి ఈనెల 30 నిర్వహిస్తామని చెప్పింది. వారికి ఆగస్టు 20 తేదీ నుంచి అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments