Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలో సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (17:25 IST)
వచ్చే నెలలో సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ కానుంది. పది, 12వ త‌ర‌గ‌తుల‌కు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ చేయనున్న‌ట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోక్రియాల్ నిషాంక్ తెలిపారు. 
 
ఈ ఏడాది మే నుంచి జూన్ 10వ తేదీ మ‌ధ్య సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అయితే ప‌రీక్ష ఫ‌లితాల‌ను జూలై 15వ తేదీన వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న గ‌తంలో తెలిపారు. రాత‌పూర్వ‌కంగానే 2021 బోర్డు ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షలు ఉండవన్నారు. 
 
ఒకవేళ విద్యార్థులు ప్రాక్టిక‌ల్స్‌కు హాజ‌రుకాలేని ప‌క్షంలో వారి కోసం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే గ‌త ఏడాది క‌రోనా వ‌ల్ల మార్చిలోనే దేశ‌వ్యాప్తంగా స్కూళ్ల‌ను మూసివేశారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మ‌ళ్లీ అక్టోబరులో స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇంకా అనేక రాష్ట్రాల్లో బ‌డులు తెర‌వలేదు. బహుశా ఈ విద్యా సంవత్సరం తర్వాతే స్కూల్స్ తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments